Sunday, April 28, 2024

Bollywood : ఇద్ద‌ర్ని లోప‌లేశారు…

బాంద్రా ప్రాంతంలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఉండే గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ వద్దకు మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసిన ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

కాల్పుల అనంతరం ముంబయి నుంచి పరారైన వారు గుజరాత్‌లోని భుజ్‌లో చిక్కినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి వారిని అదుపులోకి తీసుకున్నామని, ముంబయికి తీసుకొచ్చి విచారిస్తామని పేర్కొన్నారు.

ఈ నిందితులు నవీ ముంబయి పన్వెల్‌లో ని హరిగ్రామ్‌ ప్రాంతంలో నెల రోజులుగా అద్దె ఇంట్లో మకాం వేసినట్లు ఓ అధికారి తెలిపిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితులకు ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమాని, నిందితులు ఉపయోగించిన ద్విచక్ర వాహనం పూర్వ యజమాని, మోటారు సైకిల్‌ను విక్రయించడంలో సహకరించిన ఏజెంట్‌ను విచారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement