Monday, April 15, 2024

పెంచిన గ్యాస్‌ ధరలను తగ్గించాలి : ఎమ్మెల్యే మదన్ రెడ్డి

నర్సాపూర్ : కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి సామాన్య ప్రజల బ్రతుకులు చిన్నా భిన్నం అవుతున్నాయని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహిళలు ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలుపుతూ ధర్నా, రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. అంతేగాక పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంతో అన్ని రకాల వస్తువుల పై భారం పడి ధరలు ఆకాన్నంటాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేది బోయి భారీ ధరలు పెంచుతూ సామాన్య ప్రజలపై భారం మోపుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో బిజెపిని ప్రజలు గద్దె దింపుతారని అన్నారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement