Saturday, April 20, 2024

ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో నిమ‌జ్జ‌నాలు జ‌ర‌గాలి : ఎస్పీ రమణ కుమార్

సదాశివపేట : పట్టణ పరిధిలో నిర్వహించే వినాయక నిమజ్జనోత్సవ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రమణకుమార్ గురువారం చెరువు పరిసరాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో నిర్వహించే వినాయక నిమజ్జనోత్సవం, పెద్ద వినాయక నిమజ్జనోత్సవం కార్యక్రమంలో  ప్రజలకు ఎలాంటి అంతరాయం కలగకుండా శాంతియుతంగా నిమజ్జనోత్సవం జరుపుకోవాలన్నారు. చెరువు పరిసరాల, రోడ్లను వాహనాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలన్నారు. చెరువు వద్దకు చిన్న పిల్లలు రాకుండా చూడాలన్నారు. అదేవిధంగా వినాయక నిమజ్జనంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో జరిగేలా చూడాలని అధికారులను,   ప్రజా  ప్రతినిధులు ఆదేశించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement