Friday, May 10, 2024

అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన మంత్రి హ‌రీశ్ రావు

రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌రీశ్ రావు సిద్దిపేట‌ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్క‌ర్ 131వ జ‌యంతి సంద‌ర్భంగా జిల్లాలోని చిన్నకోడూర్ మండలం చందలాపూర్ గ్రామంలో డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈసంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్ రావు అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement