Saturday, May 4, 2024

కేసీఆర్‌ నగర్‌లో బస్తీ దవాఖాన.. ఇదీ పేదోళ్ల హెల్త్ సెంట‌ర్‌

సిద్దిపేట ప్రతినిధి, (ప్రభ న్యూస్‌) : ప్రజా ఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం, మంత్రి హరీష్‌ రావు ప్రాధాన్యత ఇస్తున్నారు. అనటానికి నిదర్శనం బస్తి దవాఖానాలు.. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పట్టణాల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా సిద్దిపేటలోని డబుల్‌ బెడ్రూం కేసీఆర్‌ నగర్‌లో గతంలో తాత్కాలిక భవనంలో బస్తీ దవాఖాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. మంత్రి హరీష్‌ రావు కృషితో 18 లక్షలతో ఇటీవలే పక్కా భవనం నిర్మాణం చేపట్టారు. ఈ రోజు మంత్రి హరీష్‌ రావు చేతుల మీదుగా బస్తి దవాఖాన ప్రారంభ‌మైంది. దీంతో కేసీఆర్‌ నగర్‌లో పేద ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. నిరుపేద నీడలో మెరుగైన వైద్య సౌకర్యం అందించేందు, పక్క భవనం ఏర్పాటు-కు కృషి చేసిన మంత్రి హరీష్‌ రావు కేసీఆర్‌ నగర్‌ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మెరుగైన వైద్య సేవలు..

బస్తీ దవాఖానాల్లో అవుట్‌ పేషెంట్‌ సేవలు అందించడం సహా బీపీ, షుగర్‌తో పాటు 57 రకాల వైద్య పరీక్షలను చేస్తారు. ఇక్కడ సేకరించిన నమూనాలను తెలంగాణ స్టేట్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌కు పంపిస్తారు. సుమారు 150 రకాల మందులను ఉచితంగా అందిస్తారు. స్వల్పకాల అనారోగ్యానికి తక్షణ వైద్య చికిత్సలు అందించడం సహా టీకాలు వేయడం, కుటుంబ నియంత్రణ, వైద్య పరమైన కౌన్సిలింగ్‌ ఇస్తారు. ఇక పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో బస్తి దవాఖాన ఎంతో ఉపయోగపడుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement