Sunday, December 3, 2023

Medak – తండ్రి అస్థిక‌లు డ్యాంలో క‌ల‌ప‌బోతే……

మెదక్ : ఒకే కుటుంబంలో రోజుల తేడాతో ముగ్గురు మృత్యవాతపడిన విషాద ఘటన మెదక్ లో వెలుగు చూసింది. మెదక్ జిల్లాలో ఓ అన్నాదమ్ములు తండ్రి అస్తికలు గంగలో కలపడానికి వచ్చి మృత్యవాత పడ్డారు. వివ‌రాల‌లోకి వెళితే కామారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం ఇమామ్ తండాకు చెందిన శంక‌ర్ ఇటీవల మృతి చెందాడు. మృతి చెందిన తండ్రి అస్థికలు పోచారం డ్యాం లో కలిపేందుకు శంకర్ కుమారులు చౌహాన్ హరి సింగ్ (45) బాల్ సింగ్(42)లు ఇద్దరు అన్నదమ్ములు వచ్చారు. డ్యాంలో దిగి అస్థికలు కలిపే క్రమంలో ప్రమాద వశాత్తూ ఒకరు నీట మునగగా కాపాడేందుకు మరొకరు వెళ్ళారు . నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో ఉదృతిలో కొట్టుకుపోయారు. దీంతో ఇద్ద‌రూ మ‌ర‌ణించారు.. స‌మ‌చారాన్ని పోలీసుల‌కు తెల‌ప‌డంతో కొట్టుకుపోయిన ఇద్దరి మృతదేహాలను డ్యాం నుంచి వెలికి తీశారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చే్స్తున్నారు..

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement