Sunday, May 5, 2024

Medak – తెగిన అక్కంపల్లి వంతెన .. రాకపోకలకు అంతరాయం

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం – రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వెల్దుర్తి మండలంలోని అక్కంపల్లి గ్రామంలోని పెద్ద చెరువు అలుగు పారి ప్రవహిస్తున్నాడంతో గ్రామంలోకి వెళ్లే రహదారిలో ఉన్న బ్రిడ్జి పూర్తిగా తెగిపోయి పెద్ద గుయ్యగా మారింది. దీంతో గ్రామంలోకి వెళ్లాలంటే రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది బ్రిడ్జి గ్రామ మధ్యలో ఉండడంతో అటువైపున కొన్ని ఇండ్లు ఎటువైపున కొన్ని ఇండ్లు ఉన్నాయి. ఇటువైపు నుండి గ్రామస్తులు అటువైపు అటు నుండి గ్రామస్తులు అటువైపు పోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని బ్రిడ్జి తెగినప్పుడు రావడం తాత్కాలిక మరమ్మతులు చేయడం చేతులు దులుపుకోవడం ఆనవాయితీగా మారింది గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి పర్మినెంట్గా బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు
లేనియెడల ఆందోళన చేపడుతామని హెచ్చరించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement