Wednesday, May 8, 2024

పుర‌స్కారం అందుకున్న మేయ‌ర్ కోల‌న్ నీలాగోపాల్ రెడ్డి

స్వచ్ఛ సర్వేక్షన్ సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ లో భాగంగా దేశంలోని 4300 ప్రాంతాల్లో జరిగిన స్వచ్ఛత, ఆయా పట్టణాల్లో పారిశుధ్యానికి ఆయా నగర, పుర పాలికలు చేస్తున్న సేవలకు మెచ్చి అత్యుత్తమ సేవ, అభివృద్ధి రంగాల్లో ముందున్న కార్పొరేషన్స్, పురపాలికలు అత్యుత్తమ నగరాలను ఎన్నిక చేసి ఈరోజు మన దేశ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయా పురపాలికల పాలనాధ్యక్షులు అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. ఈ పురస్కారాల్లో భాగంగా మన రాష్ట్రంలోని 10 ప్రాంతాలు ఎన్నికైనాయి. అందులో నూతనంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికవటం కార్పొరేషన్ పాలక వర్గానికి, ప్రజలకు గర్వకారణం. ఈ ప్రయాణంలో కార్పొరేషన్ అభివృద్ధికి అనునిత్యం తోడునిలిచి ఈరోజు ఈ స్థానంలో నిలిపిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ను, త‌మ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యుల తరపున నిజాంపేట్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ హృదయపూర్వక ధన్యావాదాలు తెలిపింది.


ఈ ఘనత ఈ కార్పొరేషన్ కి దక్కటంలో మొదటి కార్పొరేషన్ మొట్ట మొదటి మహిళా మేయర్ కోలన్ నీలాగోపాల్ రెడ్డి కృషి ఎంతగానో ఉంది. రెండు సంవత్సరాలలో అద్వితీయ మైన అభివృద్ధి, ప్రజా చైతన్యంలో ముందు నిలిచిన ధైర్య శాలి, ధీర వనిత మేయర్ నీలమ్మ. నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్ మూడు ప్రాంతాలను కలుపుకుని నూతన కార్పొరేషన్ గా ఏర్పాటైన నిజాంపేట్ కు ఒక మహిళమణి మేయర్ గా ఎన్నికవటం ఒక చారిత్రక ఘట్టం. ప్రజలకు సేవచేయాలన్న‌ మనో దృక్పథం ఉంటే ఎంతకాలం నుండి రాజకీయాల్లో ఉన్నామ‌న్నది ముఖ్యం కాదన్న మాటకు నిదర్శనం మేయర్ నీలమ్మ అని నూతన వ్యవస్థలో తన చాతుర్యం, పరిపాలన ధోరణితో పాటుగా తోటి ప్రజాప్రతినిధుల, అధికార, అనధికార సిబ్బంది సహకారంతో ఈరోజు కార్పొరేషన్ ఖ్యాతిని డిల్లీ పురవీధుల్లో నిలిపిన ఘనత మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి దే అనుటలో ఎటువంటి అతిశయోక్తి లేదని నిజాంపేట్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement