Tuesday, July 16, 2024

హెలికాప్టర్ ప్రమాదంలో మల్కాపూర్ కు చెందిన ఆర్మీ జవాన్ అబ్బాల అనిల్ మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ కు చెందిన ఆర్మీ జవాన్ అబ్బాల అనిల్ జమ్మూ కాశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు అనిల్ గత 11 ఏళ్లుగా ఆర్మీలో పనిచేస్తుండగా గురువారం జమ్మూ కాశ్మీర్ వద్ద సిగ్నల్ ప్రాబ్లం వలన అనిల్ తో పాటు మరో ఇద్దరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నదిలో కూలిపోవడం తో మృతి చెందినట్లు సమాచారం. .అనిల్ కు భార్య సౌజన్య,ఇద్దరు కుమారులు అయాన్,అరవు తల్లి తండ్రులు ఉన్నారు మల్లయ్య,లక్ష్మి ,ఇద్దరు సోదరులు శ్రీనివాస్,మహేందర్ లు ఉన్నారు అనిల్ మృతితో మల్లాపూర్ లో విషాద శాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement