Tuesday, April 30, 2024

Maharashtra tour – కొల్లాపూర్ మ‌హాలక్ష్మీ అమ్మ‌వారికి కెసిఆర్ ప్ర‌త్యేక పూజ‌లు..

కొల్లాపూర్ – కొల్హాపూర్ మ‌హాలక్ష్మీ అమ్మ‌వారి దేవాల‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వేద పండితులు కేసీఆర్‌ను ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. కాగా ,మ‌హారాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌హారాష్ట్ర‌లోని కొల్హాపూర్‌కు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నాం చేరుకున్నారు. అక్క‌డ కేసీఆర్‌కు బీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్, దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంత‌రం మ‌హాల‌క్ష్మీ అమ్మ‌వారిని దర్శించుకున్నారు..

అక్క‌డ నుంచి సాంగ్లి జిల్లాలోని వాటేగావ్‌ గ్రామానికి చేరుకున్నారు. మహారాష్ట్ర యుగకవిగా, దళిత సాహిత్య చరిత్రలో ఆద్యుడిగా పేరొందిన అన్నాభావు సాఠే 103వ జయంతి వేడుకల్లో కేసీఆర్ పాల్గొన‌నున్నారు. . ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తారు. అనంతరం అన్నభావు బంధువుల ఇంటికి వెళ్లనున్నారు. అక్కడ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఇస్లాపూర్‌లోని రఘునాథ్‌ దాదాపాటిల్‌ నివాసానికి చేరుకుంటారు. కొల్హాపూర్‌లోని సాధు మహారాజ్‌ సమాధి వద్ద నివాళి అర్పిస్తారు. నాగాల పార్క్‌లోని పూధరి న్యూస్‌పేపర్‌ యజమాని ఇంటికి వెళ్తారు. తిరిగి సాయంత్రం కొల్హాపూర్‌ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement