Sunday, May 5, 2024

నోముల భగవత్‌కు బిసి సంఘాల మద్దతు..

కవాడిగూడ : నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్న నోముల భగవత్‌కు 14 బిసి సంఘాలు, 47 కుల సంఘాలు మద్దతు ఇస్తున్నట్లు బి సి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌ కృష్ణయ్య వెల్లడించారు. ఈ సందర్భంగా నగరంలోని ఓ ఫంక్షన్‌ హాలులో బిసి సంఘాల సమావేశం జరిగింది, ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడుతూ బిసి సంఘాలతోపాటు యాదవ, ముదిరాజ్‌, గౌడ్‌, రజక, శాలివాహన, మేదర, మున్నూరుకాపు కాపు సంఘాల నేతలు, బిసి టీచర్ల సంఘం ప్రతినిధులు మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో బిసి సంఘాల సమావేశం జరిగినప్పుడు ఉప ఎన్నికలో బిసి అభ్యర్థికి టికెట్‌ ఇవ్వాలని ముఖ్యమంత్ర కెసిఆర్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. బిసి సంఘాల కోరికమేరకు సిఎం కెసిఆర్‌ స్పందించి బిసి అభ్యర్థికి టికెట్‌ ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. నోముల భగవత్‌కు ప్రతి బిసి బిడ్డ అండగా నిలబడి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బిసి సంక్షేమ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, సూర్యారావు, ఎర్ర సత్యనారాయణ, నీల వెంకటేష్‌, నర్సింహాగౌడ్‌, ఉద య్‌నేత, జయంత్‌రావు, మురళికృష్ణ, శివమ్మ, నిఖిల్‌ రాజేందర్‌, ఉదయ్‌, నిఖిల్‌ తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement