Tuesday, April 23, 2024

TS : గద్వాల జమ్ములమ్మను దర్శించుకున్న డికే అరుణ

గద్వాల ప్రతినిధి , ఫిబ్రవరి 26 (ప్రభ న్యూస్): జమ్ములమ్మ అమ్మవారిని ఇవాళ ఉద‌యం డీకే అరుణ దర్శించుకున్నారు. ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు ప్రజలను చల్లగా చూడాలని వేడుకున్నట్లు చెప్పారు. అంతకుముందు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతించి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు డీకే అరుణ సన్మానించి తీర్థ ప్రసాదాలు అందచేసి అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement