Sunday, May 19, 2024

కుటుంబ ఆస్తుల‌పై కెసిఆర్ శ్వేత‌ప‌త్రం – బండి డిమాండ్

ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను దివాళా తీయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటు-ంబం మాత్రం వేల కోట్ల ఆస్తులు సంపాందించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. అభివృద్ధి చెందిన దేశంగా ‘భారత్‌’ ను చూడబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి కార్యవర్గ సమావేశాల రెండో రోజు మంగళవారం జరిగిన సమావేశంలో బండి సంజయ్‌ మాట్లాడుతూ, కేసీఆర్‌ కుటు-ంబం పైన, టీ-ఆర్‌ఎస్‌ నేతల అవినీతిపై ప్రజల్లో ఎంతటి తీవ్ర వ్యతిరేకత ఉందో ప్రజాసంగ్రామ యాత్ర ద్వారా వెల్లడైందన్నారు. ”సీఎం కేసీఆర్‌ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే… 2014కు ముందు కేసీఆర్‌ కుటు-ంబ ఆస్తులెన్ని? అధికారంలోకి వచ్చాక సంపాదించిన ఆస్తులెన్ని? అనే వివరాలపై రాబోయే అసెంబ్లీ సమావేశాలకు ముందే శ్వేతపత్రం విడుదల చేయాలి”అని డిమాండ్‌ చేశారు. మీ అందరి ఆశీర్వాదం, సహకారంతో 5 విడతల పాదయాత్రను పూర్తి చేసుకున్నామని, ప్రజాసంగ్రామ యాత్ర దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పారంటే అది గొప్ప విషయం… మనకు స్ఫూర్తి… సమాజంలో మంచి సందేశం వెళ్లిందని బండి తెలిపారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా, ఆత్మవిశ్వాసం బీజేపీ కల్పిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. టీ-ఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం అని ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు.

కేసీఆర్‌ అన్ని వర్గాలను అణిచివేస్తున్నారు. ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కుతున్నారు. ధర్నా చౌక్‌ లేకుండా చేశారు. మీడియా గొంతు నొక్కారు. ప్రతిపక్షమే లేకుండా చేశారని మండిపడ్డారు. జీవో 317 పేరుతో ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఊరుకోం.. ఈనెల 30లోపు ఆ సమస్యను పరిష్కరించాలని, భేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో 30న ఇందిరాపార్క్‌ వద్ద పెద్ద ఎత్తున దర్నా చేపట్టి నీ మెడలు వంచుతామని కేసీఆర్‌ను బండి హెచ్చరించారు. అట్లాగే 2014 నాటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నేటి ఆర్థిక పరిస్థితి, తీసుకొచ్చిన అప్పులు, వాటిని ఏ విధంగా ఖర్చు పెట్టారనే అంశాలపైనా శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. మద్యం ద్వారా తెలంగాణలో ఒక్కో కుటు-ంబం ఏటా రూ.50 వేల ఆదాయాన్ని కేసీఆర్‌ ప్రభుత్వానికి ఇస్తే… ఆ ప్రజలకు మాత్రం ఒక్కో కుటు-ంబంపై రూ.6 లక్షల అప్పు మోపి గిప్ట్‌nగా ఇచ్చారని ఎద్దేవా చేశారు. మోడీ నాయకత్వంలో భారత్‌ అగ్రగామిగా దూసుకెళ్తోందని చెప్పిన బండి సంజయ్‌ 2047 నాటికి పూర్తిస్థాయిలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా ”భారత్‌”ను చూడబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. చివరగా ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేస్తూ ఇటీ-వల మరణించిన బీజేపీ కుటు-ంబాలకు సంతాపం తెలియజేస్తూ ఆ కుటు-ంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఈ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌, కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ సోయం బాపూరావు, తమిళనాడు సహ ఇంచార్జ్‌ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్‌, జి.వివేక్‌, ఏపీ జితేందర్‌ రెడ్డి, గరికపాటి మోహన్‌ రావు, విజయశాంతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్‌ రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement