Thursday, April 25, 2024

అంతర్‌రాష్ట్ర చైన్‌స్నాచర్‌ అరెస్టు.. మ‌రో నిందితుడి కోసం గాలింపు..

హైదరాబాద్‌లో చైన్‌స్నాచర్స్‌ హల్‌చల్‌ చేస్తున్నారు. బంగారం వేసుకుని బయటకు వెళ్లాలంటేనే బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు చోట్ల నిర్మాణుశ్య ప్రదేశాల్లో ఒంటరిగా కనిపించే మహిళల మెడలో చైన్‌లు దొంగిలిస్తున్నారు. కొందరు బెదిరింపులు చేసి.. మరికొందరైతే ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడడం లేదు. తాజాగా పోలీసులు చైన్‌స్నాచింగ్‌ చేసే వారిపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు. ప్రత్యేక డ్రైవులు నిర్వహించి వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ఇదిలా నగరంలో జరుగుతున్న వరుస చైన్‌స్నాచింగ్‌ల కేసులో పోలీసులు వివిధ రాష్ట్రాల్లో దొంగల కోసం వేట మొదలు పెట్టారు. చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడిన ఇద్దరిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని హైదరాబాద్‌ పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు చేశారు. మరో దొంగకోసం బెగళూరులో గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement