Sunday, May 5, 2024

MBNR: అంగ వైకల్యాన్ని పక్కనపెట్టి బైక్ పై సాహస యాత్ర

మక్తల్, జనవరి19(ప్రభన్యూస్): రోడ్డు ప్రమాదం లో రెండు కాళ్లు పోగొట్టుకున్నప్పటికీ ఏమాత్రం అధైర్యపడకుండా తన జీవితాన్ని కొనసాగిస్తున్న వికలాంగుడు గుండ్లకుంట నారాయణ శ్రీరామ చంద్రుడిపై ఉన్న అమితమైన భక్తితో మక్తల్ నుండి అయోధ్యకు బైక్ యాత్రను తలపెట్టాడు.

నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని సత్యవార్ గ్రామానికి చెందిన రెండు కాలు లేని గుండ్లకుంట నారాయణ తన సహచరుడు చంద్రకాంత్‌తో కలిసి ఈనెల 14న మక్తల్ పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం స్థానిక హిందూ ధర్మిక సంస్థల ప్రతినిధులు వీడ్కోలు పలుకగా బైకుపై అయోధ్యకు బయలుదేరారు. సుమారు 1500 కిలోమీటర్ల దూరం ఆరు రోజుల పాటు నిర్విరామంగం ప్రయాణించి ఇవాళ అయోధ్యకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. అయోధ్య చేరుకోవడంతో దారి వెంబడి పలువురు తనకు ఘన స్వాగతం పలకడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తపరిచారు. అయోధ్య చేరుకోవడంతో తన జన్మ ధన్యమైందని ఈనెల 22న రామ మందిరం ప్రారంభోత్సవం రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను తిలకించి తిరిగి మక్తల్ బయలుదేరనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement