Friday, May 17, 2024

Rain Alert | బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం.. ఇవ్వాల‌, రేపు భారీ వ‌ర్షాలు!

తెలంగాణలో ఇవ్వాల‌, రేపు (శుక్ర‌, శ‌నివారాలు) ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలలో కొనసాగుతోంది. అల్పపీడనం పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ రాగల రెండు నుండి మూడు రోజుల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర చత్తీస్‌గఢ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు చెప్పారు. ఇవ్వాల దిగువస్థాయిలోని గాలులు, పశ్చిమ, వాయవ్య దిశల నుండి తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నాయ‌ని వెల్ల‌డించారు.

కాగా, ఇవ్వాల ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెంలలో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంద‌ని అధికారులు తెలిపారు. రేపు ఆదిలాబాద్, కుమురం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వెల్లడించింది. ఈ రెండు రోజుల పాటు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement