Sunday, May 5, 2024

TS : 18 ఏళ్ల ప్రయత్నాలకు విముక్తి …. దుబాయ్ నుంచి ఇంటికి చేరిన ఇద్దరు

సిరిసిల్ల, ఫిబ్రవరి 21 (ప్రభన్యూస్): ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి అనుకోకుండా హత్య కేసులో ఇరుక్కుని 18 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన సిరిసిల్ల ప్రాంత వాసులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. దేశం కానీ దేశంలో మన భాష కాని ప్రాంతల్లో ఐదుగురు బాధితులు జైలు పాలు కాగా అనేకమంది కాళ్ళ వేళ్ళ పడి సాయం పొంది ఇప్పటికే ఇద్దరు జిల్లా వాసులు జైలు నుంచి విముక్తి పొందగా తాజాగా పెద్దూరుకు చెందిన ఇద్దరు బుధవారం ఇంటికి చేరుకున్నారు.

- Advertisement -

మరో వ్యక్తి మరో నెల రోజులకు ఇంటికి చేరనున్నారు. మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యులు కే తారక రామారావు ఈ ఉదoతంలో ప్రత్యేకంగా చొరవ తీసుకోవడంతో దుబాయ్ న్యాయస్థానం క్షమాభిక్ష ప్రసాదించింది. పెట్టకేలకు18 ఏండ్ల జైలు జీవితం అనంతరం.. బాధితులు స్వదేశానికి చేరుకున్నారు.18 సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్న 5 గురు జిల్లా వాసులలో కోనరావుపేట మండలానికి చెందిన దండుగుల లక్ష్మణ్ రెండు నెలల క్రితం దుబాయ్ జైలు నుండి విడుదల అయ్యాడు. మరొకరు రుద్రంగి మండలం మనాల గ్రామానికి చెందిన శివరాత్రి హన్మంతు రెండు రోజుల క్రితం విడుదలై ఇంటికి చేరుకున్నాడు. ప్రస్తుతం దుబాయ్ కోర్టు క్షమాభిక్షతో ఒక్కొక్కరు ఇంటి బాట పట్టిన జిల్లా వాసులు.

తాజాగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ గ్రామానికి చెందిన శివరాత్రి మల్లేశం, రవి అనే ఇద్దరు అన్నదమ్ములు ఈనెల 21న బుధవారం స్వరాష్ట్రానికి చేరుకున్నారు. చందుర్తి మండలానికి చెందిన మరో వ్యక్తి వెంకటేశ్ వచ్చే నెలలో విడుదల అవుతారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా అందరికీ మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మేల్యే కేటీఆర్ విమాన టికెట్లు సమకూర్చారు.18 సంవత్సరాల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకున్న జైలు పక్షులు కలుసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

ఇదిలా ఉండగా ఈ ఉదoతo పూర్వాపరాలలోకి వెళ్తే చందుర్తి మండలానికి చెందిన ఒక్కరు గోళం నాంపల్లి, శివరాత్రి హనుమండ్లు, కొనరావుపేట గ్రామానికి చెందిన దండుగుల లక్ష్మణ్ దుబాయ్ కి వెళ్ళారు. వెళ్లిన ఆరు నెలల అనంతరం నేపాల్ కు చెందిన బహదూర్ సింగ్ అనే వాచ్మెన్ హత్యకు గురయ్యాడు. అక్కడే పని చేస్తున్న జిల్లా వాసులు ఈ ఐదుగురు కేసులో ఇరుక్కున్నారు. భాష సరిగా రాకపోవడంతో పోలీసులకు ఏం చెప్పారో తెలియదు కానీ శిక్ష రుజువు కావడంతో దుబాయ్ కోర్టు మొదట పదేళ్లు జైలు శిక్ష వేశారు. అనంతరం అప్పిలుకు వెళ్ళగా 25 ఏళ్ల శిక్ష విధించింది. దుబాయ్ చట్టాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు క్షమా భిక్ష పెడితే విడుదల అవకాశం ఉండగా 2011లో ఎమ్మెల్యే కేటీఆర్ చొరవ తీసుకొని ఒకసారి నేపాల్ కూడా వెళ్లి వచ్చారు. నేపాల్ కు చెందిన బహదూర్ కుటుంబ సభ్యులతో లాయర్ అనురాధ, ఇతర ప్రతినిధుల సహకారంతో  క్షమాభిక్ష పై సంతకాలు  చేయించారు. వారికి ఆర్థికంగా కేటీఆర్  పదిహేను లక్షల రూపాయల చెక్కును అందించారు. అప్పుడే దుబాయ్ లో చట్టాలు మారడంతో విడుదల గగనమైంది. వీరి క్షమాభిక్ష పిటిషన్ దుబాయ్ కోర్టు కొట్టి వేసింది. సెప్టెంబర్ లో మంత్రి కేటీఆర్ దుబాయ్ కోర్టులో బాధిత కుటుంబ సభ్యులతో మళ్ళీ  కేసు వేయించడం, కేంద్ర విదేశాంగ శాఖ సహకారంతో దుబాయ్ రాజు అపాయింట్మెంట్ సాధించి ఈ కేసులో క్షమాభిక్ష కోరడం కోసం మంత్రి దుబాయ్ లో అక్కడి అధికారులతో సమీక్షించారు. జైల్లో ఉన్న మా భర్తని తీసుకురావడానికి మాజీ మంత్రి కేటీఆర్ అనేక ప్రయత్నాలు చేసిన కృషి సఫలం అయ్యాయని అతనికి మేము జీవితాంతం రుణపడి ఉంటామాని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement