Sunday, April 28, 2024

L&T – మాట మార్చిన ఎంల్ అండ్ టీ… మేడిగడ్డ పునరుద్ధరణకు డబ్బు కట్టాల్సిందే

మేడిగడ్డ బ్యారేజీ మరోసారి వార్తల్లో నిలిచింది. మేడిగడ్డ బ్యారేజీ లో జరిగిన నష్టాన్ని పునరుద్ధరించే పని తమది కాదని మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎలాంటి తేల్చి చెప్పింది. మేడిగడ్డలో బ్యారేజీ కుంగిపోవడం, దెబ్బతిన్న పియర్స్ ను తాము పునరుద్ధరించమని తెలిపింది. వీటి పునరుద్ధరణ పనులు చేయాలంటే దానికి అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు అనుబంధ ఒప్పందాన్ని చేసుకుంటేనే పనుల్లో ముందడుగు వేస్తామని తెలిపింది.

అయితే బ్యారేజీ కుంగిపోయిన సమయంలో నిర్వహణ గడువు ఇంకా ఉందని, ఎంల్అండ్ టీ ప్రాజెక్టు ఇంజనీర్లు అధికారికంగా పునరుద్ధరణ అయ్యే ఖర్చు మొత్తం నిర్మాణ సంస్థ భరిస్తుందని ప్రకటించారు కూడా. నిర్మాణ సంస్థ కూడా ఈ మేరకే ప్రకటన చేసింది. కానీ ఇప్పుడు దీనికి భిన్నంగా మేడిగడ్డ నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ లేఖ రాయడం చేర్చనీయాంశంగా మారింది. దీని మీద తదుపరి చర్యలు తీసుకోవాలని సంబంధిత ఇంజనీర్ ఇన్ని చీఫ్ కిందిస్థాయి ఇంజనీర్లకు ఆ లేఖను పంపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement