Sunday, April 28, 2024

KYC – రూ.500ల‌కే గ్యాస్ సిలిండ‌ర్… క్యూ క‌ట్టిన మ‌హిళ‌లు..

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని వెల్లడించింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ అధికారం చేపట్టగానే మొదటి గ్యారంటీగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసింది. ఈ గ్యారెంటీలలోనే మరొకటి మహిళలకు కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందిస్తామని కాంగ్రెస్ తెలిపింది. ఈ పథకం కూడా అర్హులైన లబ్ధిదారులకు అధికారంలోకి వచ్చిన వెంటనే అందిస్తామని చెప్పింది.

అయితే ఈ పథకం కోసం ఈ-కేవైసీ చేయించుకోకపోతే సబ్సిడీ రాదు అని వదంతంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం అవుతుంది. వెంటనే మహిళలందరూ కూడా ఆధార్ కార్డులతో గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరారు. కాగా, కేంద్ర ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ ఈ-కేవైసీ చేసుకొని మహిళలందరు వెంటనే చేయించుకోవాలని వెల్లడించింది. దీంతో తమకి ఈ-కేవైసీ పూర్తి చేసుకోకపోతే సబ్సిడీ సిలిండర్ రాదు అనుకుని మహిళలు గ్యాస్ ఏజెన్సీల ముందు భారీగా క్యూ కట్టారు. గ్యాస్ ఏజెన్సీలు మాత్రం అలాంటివి ఏమీ లేదని కేవలం ఈ-కేవైసీ పూర్తి కానీ వారికి మాత్రమే చేస్తున్నామని తెలిపాయి. తెలంగాణలో గ్యాస్ లబ్ధిదారులందరూ ఈ విషయంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అయినప్ప‌టికీ గ్యాస్ డీల‌ర్ల వ‌ద్ద‌కు పెద్ద సంఖ్య‌లో వచ్చి కెవైసీ చేయించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement