Sunday, April 28, 2024

KTR : గన్ మిస్ ఫైర్ అయింది..కాంగ్రెస్ కు శుభాకాంక్షలు.. కేటీఆర్​

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్​ స్పందించారు. రెండుసార్లు బీఆర్​ఎస్​కు అవకాశమిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. అలాగే ఫలితాలు నిరాశ కలిగించలేదు, కానీ నిరాశకు గురి చేశాయని చెప్పారు. ఈ ఫలితాలను ఒక పాఠంగా తీసుకొని తిరిగి పుంజుకుంటామని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ఆయన అభినందనలు చెప్పారు. ఆ పార్టీకి ఆల్ ది బెస్ట్ తెలిపారు. 

అలాగే కొంత సమయం తరువాత చేసిన మరో ట్వీట్ లో కాస్తా హాస్యాన్ని జోడించారు. శనివారం సాయంత్రం ఆయన చేసిన ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ.. ఈ సారి మిస్ ఫైర్ అయ్యిందంటూ స్మైలీ ఇమోజీ పెట్టారు. ఫలితాలు తమకు అనుకూలంగానే వస్తాయని చెబుతూ నిన్న సాయంత్రం ఆయన గన్ తో షూట్ చేస్తున్నట్టు ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ను తాజాగా రీట్వీట్ చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement