Wednesday, May 1, 2024

KTR Confident – మ‌ళ్లీ మా ప్ర‌భుత్వ‌మే వ‌స్తుంది… హైద‌రాబాద్ ను మ‌రింత అభివృద్ధి చేస్తాం..కెటిఆర్

హైదరాబాద్‌: డిసెంబర్‌ 3న మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తుందని, వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్‌లో 24 గంటలు మంచినీళ్లు సరఫరా చేస్తామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. హైదరాబాద్‌ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌ల ప్రతినిధులతో జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర వాసుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ తగ్గిస్తామన్నారు.
ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్నే ఆశీర్వదిస్తారని అన్నారు. . హైదరాబాద్‌ను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గణనీయంగా అభివృద్ధి చేసిందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో మంచి పురోగతి సాధించామని చెప్పారు. తాము చేసిన అభివృద్ధి మీ కళ్ల ముందే కనిపిస్తోందన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయని మంత్రి చెప్పారు. ఈ మహానగరానికి చారిత్రకంగా గొప్ప పేరుందని అన్నారు. పాత హైదరాబాద్‌ నగరాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ ఎంతో అభివృద్ధి చెందినదని నటుడు రజినీకాంత్‌ పొగిడిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. అభివృద్ధిలో హైదరాబాద్‌ న్యూయార్క్‌తో పోటీ పడుతోందని అన్నారు.


గత పదేళ్లలో నగరంలో 36 ఫ్లైవోర్లు నిర్మించామని, 39 చెరువులను నవీకరించామని మంత్రి చెప్పారు. మిషన్‌ భగీరథ కార్యక్రమంతో హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేకుండా చేశామని తెలిపారు. అదేవిధంగా దేశంలో నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌, తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని గుర్తుచేశారు.

‘నగరంలో ట్రాఫిక్ సమస్యను రాబోయే రోజుల్లో తగ్గిస్తాం. మీరు చెప్పిన సమస్యలన్నీ డిసెంబర్ 3 తర్వత పరిష్కరిస్తాం. డిసెంబర్ 3న మళ్ళీ మేమే వస్తాం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. హైదరాబాద్‌లో తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎన్నో అనుమానాలు ఉండేవి. వాటన్నింటినీ పటాపంచలు చేశాం. రాబోయే రోజుల్లో మెట్రోను మరింత విస్తరిస్తాం. ట్రాఫిక్ తగ్గాలంటే మెట్రో సేవలు మరింత పెరగాలి. జీహెచ్‌ఎంసీకి ఒక కమిషనర్‌ సరిపోరు. మరో ఇద్దరు స్పెషల్ కమిషనర్‌లను నియమిస్తాం. వీరిలో ఒకరు పచ్చదనం, పార్కుల పరిరక్షణకు ,మరొకరు చెరువుల పరిరక్షణ చూసే విధంగా చూస్తాం’ అని కేటీఆర్‌ తెలిపారు.

గత పదేళ్లలో నగరంలో 36 ఫ్లైవోర్లు నిర్మించామని, 39 చెరువులను నవీకరించామని మంత్రి చెప్పారు. మిషన్‌ భగీరథ కార్యక్రమంతో హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేకుండా చేశామని తెలిపారు. అదేవిధంగా దేశంలో నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌, తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని గుర్తుచేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement