Tuesday, May 28, 2024

Abhaya Hastham డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడకుండా చూడండి – ప్రభుత్వానికి కేటీఆర్ వినతి

హైదరాబాద్‌ : ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపై నిర్లక్ష్యంగా పడిపోవటంతో కేటీఆర్ ఎక్స్‌(ట్విటర్‌)లో అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రజల నుంచి స్వీకరించిన ప్రజాపాలన అప్లికేషన్‌లను ప్రైవేట్ వ్యక్తులు నిర్లక్ష్యంగా పట్టుకెళ్తున్న వీడియోలను తాను తరచూ చూస్తున్నానని తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తులలో కోట్లాది మంది తెలంగాణ పౌరుల సున్నితమైన డేటా ఉందని, ఈ రహస్య డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. ఎవరైనా మీకు పింఛను, ఇల్లు , 6 గ్యారంటీలలో ఏదైనా ఇస్తామని కాల్ చేస్తే ఓటీపీతో పాటు బ్యాంకు వివరాలను ఇవ్వవద్దని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాటలు విని అనవసరంగా డబ్బులు పోగొట్టుకోకండని సూచించారు

బీఆర్‌ఎస్‌కు ఓటు వేశామా లేదా అనే దానితో సంబంధం లేకుండా సైబర్ క్రైమ్ చట్టాన్ని రూపొందించడంలో భాగమైన వ్యక్తిగా నా మాటను తీవ్రంగా పరిగణించి సైబర్ నేరగాళ్ల బారిన పడకండని కేటీఆర్‌ కోరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement