Wednesday, April 24, 2024

TS : విచార‌ణ‌కు హాజ‌రైన క్రిష్ …

గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అనూహ్యంగా గ‌త రాత్రి గచ్చిబౌలి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. డైరెక్టర్ క్రిష్‌ను పోలీసులు దాదాపు 4 గంటలకుపైగా ప్రశ్నించినట్లు సమాచారం. డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వస్తుండటంతో పోలీసులు క్రిష్ శాంపిల్స్ సేకరించారు.

క్రిష్ బ్లడ్, యూరిన్ శాంపిల్స్ సేకరించి పోలీసులు ల్యాబ్‌కు పంపించారు. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం క్రిష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని.. ఈ కేసులో తనను బలవంతంగా ఇరికించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. క్రిష్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement