Friday, May 10, 2024

Counter – ప్రజల మీద లేని ప్రేమను ఒలకబోస్తున్నారు – కెటిఆర్ కు మంత్రి సురేఖ కౌంట‌ర్

హైదరాబాద్ – గత ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏండ్లలో అమలు చేయలేని కనీస అవసరాలను నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంటే.. జీర్ణించుకోలేక చిల్లర మాటలు.. చిల్లర విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్పై మంత్రి కొండ సురేఖ మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఏర్పడి నెల కూడా కాలేదని, కనీసం 100 రోజులు కూడా గడవలేదని, అప్పుడే 100 రోజుల్లో ప్రభుత్వం పడిపోతాది.. అంటే మళ్ళీ ఎలక్షన్ లు వస్తయా?ప్రజలను ఎందుకు తప్పుతోవ పట్టిస్తున్నారని మంత్రి సురేఖ ప్రశ్నించారు.

ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకొని.. , ఉద్యమకారులను అన్యాయంగా బయటకు పంపింది ఎవరు? మహిళలపై దాడులు జరిగినప్పుడు గానీ, కొండ గట్టు మీద జరిగిన ఘోర ప్రమాదం లో 63 మంది చనిపోతే స్పందించని ఈ లీడర్లు ఇప్పుడు ప్రజల మీద ప్రేమ ఒలకబోస్తున్నారని, ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించడం.. సిగ్గుచేటు అని సురేఖ అన్నారు..

దళితులకు మూడెకరాల భూమి ఎందుకుయ్యలేదు..
దళితులకు మూడెకరాల భూమి ఏమైంది.. తెలంగాణకు దళితుడిని తొలి ముఖ్యమంత్రి చేస్తామని చేసిందెవరు..?రైతుల రుణమాఫీ ఇస్తామని ఎగ్గొట్టింది ఎవరు..? తొమ్మిదిన్నరేండ్ల పాలనలో తెలంగాణ లో విధ్వంసం జరిగింది. బీఆర్ఎస్ అహంకారంతో పరిపాలన అస్తవ్యస్తమైంది.అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఇచ్చిన అభయహస్తం గ్యారంటీ హామీల ప్రకారం ఆర్టీసీలోఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని, మీ కుటుంబం లోని మహిళలనో, మీ పార్టీ మహిళా లీడర్లనో ఒక్క సారి ఆర్టీసీ బస్సు లో ఒక్కసారి ప్రయాణం చేయమని చెప్పండి.. మేం ఇచ్చిన హామీ అమలవుతుందో లేదో తెలుస్తుందని మంత్రి సురేఖ సవాల్విసిరారు. మేడిగడ్డ ఎలా కుంగింది? బాధ్యులెవరు??కాళేశ్వరం పై న్యాయ విచారణ అనగానే.. కేసీఆర్ కు, కేటీఆర్ కు వణుకు మొదలైందని, ఇందులో ఎవరెవరి వాటా ఎంత? ప్రజాధనం ఎంత దుర్వినియోగమైందో.. అదంతా కక్కించేందుకు కాంగ్రెస్ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి సురేఖ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement