Sunday, April 14, 2024

TS: లారీ ఢీకొని.. ఒకరు మృతి

సత్తుపల్లి రూరల్ : నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన‌ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కల్లూరు‌ దాసు (35) నడుచుకుంటూ వెళ్తుండగా.. అదే సమయంలో సుబాబుల్ లోడుతో దమ్మపేట మండలం నుంచి సత్తుపల్లికి వస్తుంది.

ఈ క్రమంలో దాసును లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందగా.. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.‌ సత్తుపల్లి పోలీసులు సంఘటన స్థలం బుగ్గపాడుకు వెళ్లి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement