Saturday, October 5, 2024

నాటు నాటుకు ఆస్కార్ హర్షణీయం : ఎంపీ రవిచంద్ర

ఖమ్మం : నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ పురస్కారం రావడం పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలుగు చిత్ర పరిశ్రమకే కాకుండా యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు గర్వకారణమని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఈ పాట రచయిత జయశంకర్ భూపాలపల్లికి చెందిన చంద్రబోసు, ఇది పాడిన హైదరాబాద్ నగర వాసి రాహుల్ సిప్లిగంజ్ లకు రవిచంద్ర ప్రత్యేకంగా శుభాభినందనలు తెలిపారు. అలాగే.. మరో గాయకుడు
కాలభైరవ, సంగీతం అందించిన కీరవాణి, చిత్ర దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లకు ఎంపీ వద్దిరాజు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారి పేరు ప్రతిష్ఠలను విశ్వ సినీ వేదికపై చాటిచెప్పిన ఆర్ఆర్ఆర్ చిత్ర బృందాన్ని ఎంపీ రవిచంద్ర ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement