Monday, April 15, 2024

పొంగులేటి టార్గెట్ గా మంత్రులు హారీష్,పువ్వాడ పంచ్ లు…

ఖ‌మ్మం – ప్ర‌స్తుతం బి అర్ ఎస్ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంటున్న మాజీ ఎంపి , ఖ‌మ్మం జిల్లా నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి టార్గెట్ గా మంత్రులు హారీష్ రావు, పువ్వాడ‌లు విరుచుకు ప‌డ్డారు.. ఎక్క‌డా అత‌డి పేరు ఎత్త‌కుండా పరోక్షంగా పంచ్ లు కురిపించారు అమాత్యులు.. ఖమ్మంలో నేడు జరిగిన సన్నాహక సభలో మంత్రులు హాట్ కామెంట్స్ చేశారు. . కొంత కాలంగా బి ఆర్ ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న పొంగులేటి త్వరలోనే క‌మ‌లం గూటికి వెళ్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో బిజెపికి స్థానం లేదంటూ కామెంట్స్ చేశారు హరీష్‌రావు. క‌మ‌లం పార్టీలో చేరడమంటే ఆత్మహత్యా సదృశ్యమే అని హెచ్చ‌రించారు… విప్లవాల గడ్డపై మతతత్వ పార్టీలకు చోటు లేదంటూ ఝ‌ల‌క్ ఇచ్చారు..ఈ సారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పదికి 10 స్థానాల్లోనూ త‌మ‌దే గెలవాలంటూ ధీమా వ్య‌క్తం చేశారు..

ఇక మంత్రి పువ్వాడ అజయ్ కూడా పొంగులేటి టార్గెట్‌గా పంచ్‌లు వేశారు. తాను కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తానని ప్రచారం చేస్తున్నార‌ని పేర్కొన్నారు… త‌న‌ను ఎదుర్కోలేక అబద్దపు ప్రచారాలు చేస్తున్నారంటూ పొంగులేటిపై మండిపడ్డారు. కొందరు నేతలకు పుట్టగతులు లేవని ,అయినా ప్రగల్భాలు పలుకుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. తాను ఖ‌మ్మం లోనే ఉంటాన‌ని, ప్రత్యర్థులను కూకటివేళ్ళతో పెకిలిస్తాన‌ని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement