Sunday, October 6, 2024

KHM: మోసపూరిత వాగ్ధానాల బీఅర్ఎస్ ను ఓడించండి..

ఇల్లందు : గతంలో చేసిన వాగ్ధానాలను విస్మరించి, మోసపూరిత వాగ్ధానాలతో మీ ముందుకు వస్తున్న బీఅర్ఎస్ ను ఓడించాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి కే.సారయ్య, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య విజయం కాంక్షిస్తూ సీపీఐ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలో జోరుగా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు విస్మరించి కోట్లాది రూపాయలు దండుకుంటున్న అధికార పార్టీ నేతలను ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ విజయంలో ప్రజలు తమవంతు పాత్ర పోషించి విజయాన్ని అందించాలని కోరారు. సకల జనుల సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ శంకర్, బంధం నాగయ్య, వార్డు సభ్యులు నవీన్, రవి, రాజారాం వలి, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement