Saturday, April 27, 2024

KHM: బీఆర్ఎస్ కు చంద్రుగొండ మండల ప్రధాన కార్యదర్శి రాజీనామా

చంద్రుగొండ, నవంబర్ 1 (ప్రభ న్యూస్): చంద్రుగొండ మండల బీఆర్ఎస్ పార్టీకి మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తనతో పాటు సుమారు 200 మంది అనుచరులతో తుమ్మల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లుగా తెలియజేశారు. పార్టీలో తనకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదని అనుక్షణం అవమానాలకు గురి చేస్తున్నారన్నారు.

కొత్తగా వచ్చిన వారికి పెత్తనం కట్టబెట్టడం బీసీ బంధులో తన ప్రమేయం లేకుండా లబ్దిదారుల ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గాదే ప్రసాద్, మాజీ ఎంపీటీసీ లక్ష్మణరావు, కాశి, దండుగల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement