Sunday, May 19, 2024

Khammam – పొంగులేటి తీరుమార‌కుంటే జిల్లాలోని 10 సీట్లలో కాంగ్రెస్ ఓటమి తథ్యం..- తాటి వెంక‌టేశ్వ‌ర్లు

హైద‌రాబాద్ – కాంగ్రెస్ నేత పొంగులేటి తీరు మార్చుకోకపోతే రానున్న ఎన్నికలలో పాత ఖమ్మం జిల్లాలోని 10 సీట్లలో కాంగ్రెస్ ఓటమి తథ్యం అని టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్లు చెప్పారు.. ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ, పొంగులేటి నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నార‌ని ఆరోపించారు.. గత నెలలో అశ్వరావుపేట లో జరిగిన సమావేశానికి తనతో పాటుగా నియోజకవర్గ స్థాయి నేతలను ఎవరిని కార్యక్రమానికి ఆహ్వానించలేద‌ని గుర్తు చేశారు.

ఇప్పటికైనా పొంగులేటి ఆయన వర్గీయులు పద్ధతి మార్చుకొని అందరిని కలుపుకుపోవాల‌ని హిత‌వు ప‌లికారు.. టిక్కెట్టు ఎవరికి అధిష్టానం కేటాయించినా సరే కలిసికట్టుగా పని చేసి గెలుపుకు కృషి చేయాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్తానని తాటి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement