Sunday, March 3, 2024

TS: కేసీఆర్ ది నమ్మకద్రోహం.. జైరాం రమేష్

తొమ్మది ఏళ్ళల్లో తెలంగాణకు కేసీఆర్ చేసింది ఏమీ లేదని, నమ్మక ద్రోహమని ఏఐసీసీ నాయకుడు జైరాం రమేష్ అన్నారు. ఇవాళ కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… కేసీఆర్ పీరియడ్ అయిపోయిదని, కాంగ్రెస్ గ్యారెంటీ పీరియడ్ మొదలు కానుందన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెలరోజులకు జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామన్నారు. రైతు బంధు హరీష్ రావు వల్ల ఆగిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రకటించిన రైతు బంధు అమలవుతుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సచివాలయంకు సీఎం వస్తారని, ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement