Monday, March 4, 2024

HYD : ఈనెల 9 న రాష్ట్ర కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం కార్తీక మాస వనభోజనాలు

ఎల్బీనగర్, డిసెంబర్ 7(ప్రభ న్యూస్) కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం హైదరాబాద్ తూర్పు విభాగం ఆధ్వర్యంలో ద్వితీయకార్తీకమాస వనభోజన కార్యక్రమాన్ని ఈనెల 9 వ తేదీ శనివారం ఉదయం మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని ఎం ఈ రెడ్డి గార్డెన్ లో నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు తీగుల్ల యాదగిరి తెలిపారు.

గురువారం ఉదయం ఎల్బీనగర్ సంఘం కార్యాలయంలో వనభోజనాల బ్రోచర్ను ఆవిష్కరించారు. మలకపేట నుండి అబ్దుల్లాపూర్మెట్, ఉప్పల్, ఇబ్రహీంపట్నం పలు పరిసర ప్రాంతాల కుమ్మర శాలివాహన సంఘం సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొని కార్తీకమాస వనభోజనాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక , ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ముఖ్య అతిథులకు సన్మాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి ఈ, నారాయణ. కోశాధికారి ఎస్ అంజయ్య, సలహాదారులు ఇటుకల వీరయ్య తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement