Tuesday, October 15, 2024

Peddapalli: ముస్లింలకు అండగా ఉంటా… ఆదరించి గెలిపించండి.. ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి (ప్రభ న్యూస్) : ముస్లిం సోదరులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి అండగా ఉంటానని.. ఆదరించి గెలిపించాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలియజేశారు. బుధవారం ముస్లిం పెద్దలు అహ్మద్ బేగ్ ను కలిసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. గతంలో ఏ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కృషి చేయలేదని, కేసీఆర్ మైనార్టీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.

పెద్దపల్లి ముస్లింలతో తనకు 40ఏళ్ల అనుబంధం ఉందని, ప్రతి కుటుంబంతో సోదర సంబంధాలు ఉన్నాయన్నారు. పట్టణంలో మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, గత రెండు పర్యాయాలు ఆదరించిన విధంగా మరోసారి అండగా ఉండాలని కోరారు. రాబోయే రోజుల్లో పెద్దపల్లి నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, పట్టణ రూపురేఖలు మార్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అజీజ్, తబ్రేజ్, ముబిన్, జావిద్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement