Friday, May 17, 2024

కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీమహాలక్ష్మీదేవి

మహాకాళీ, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ ముగ్గురమ్మల మూల మూర్తి పార్వతీదేవి. ఈ మాతను పూజిస్తే ముగ్గురమ్మల ఆశీర్వాద ఫలం లభిస్తుందని మన ఇతిహాస కథనం. శరన్నవ రాత్రులలో సర్వజగత్తుకు మూలకారణమైనది… శక్తి స్వరూపి ణి అయిన జగన్మాతను తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల లో పూజించడం తరతరాల మన సంప్రదాయం. దుర్గా నవరా త్రులలో నాలుగవ రోజు అయిన బుధవారం శ్రీ మహాలక్ష్మి అలం కారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని భక్తితో పూజించుదాము.

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్షలబ్ద విభవ బ్రహ్మంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియామ్‌||

అంటూ భక్తి విశ్వాసాలతో తనను పూజించే భక్తులపై తన కరుణా కటాక్షాలను కురిపించే చల్లని తల్లి శ్రీమహాలక్ష్మి. కొలిచిన వారి కొంగుబంగారం అయిన శ్రీమహాలక్ష్మి విశిష్టతను భక్తితో స్మ రించుకుందాం.
శ్రీమన్నారాయణుని హృదయసుందరి శ్రీమహాలక్ష్మి. సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖసంతోషాలకు, సంతానానికి ప్రతీ క. జగత్తు స్థితి కారకుడైన శ్రీమహావిష్ణువునకు తోడుగా మహాలక్ష్మి ఉద్భవించినదని దేవీభాగవతంలో చెప్పబడినది. భృగు మహర్షి కుమార్తెగా జన్మించిన కారణముగా ఈమెను ‘భార్గవి’ అని కూడా పిలుస్తారు. తదనంతర కాలంలో ఈమె దూర్వాసుని శాపం కారణంగా పాలసముద్రము నుండి తిరిగి ఉద్భవించింది. ఈమెను చంద్రసహోదరి అని కూడా వ్యవహరి స్తారు. శ్రీ మహాలక్ష్మిని తామరపూవులతో సహస్రనామ పూజ సర్వ శుభాన్నిస్తుంది.
నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠేసురపూజితే|
శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే||
ఈ తల్లిని శ్రీసూక్త పారాయణతో, మహాలక్ష్మి సహస్రనామ ములతో, మహాలక్ష్మాష్టక స్తోత్రముతో స్తుతించాలి.ఈ తల్లికి తోపురంగు చీరను, బంగారు వర్ణముగల చీరను సమర్పించి, కలువపూవులతో, తామరపూవులతో అర్చించాలి. నైవేద్యంగా పూర్ణం బూరెలు సమర్పించాలి. ఆవుపాల పాయసం నైవేద్యం ఐశ్వర్య ప్రదం.

క్షీరోదజే కమల కోమల గర్భగౌరి|
లక్ష్మి! ప్రసీద సతతం సమతాం శరణ్య|| పాలకడలి నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవిని విశ్వసించి, శరణుకోరితే చింతలు దూ రమై ధనధాన్య కీర్తి కుటుంబ వంశవృద్ధి విజయం లభిస్తాయి.
విజయవాడ కనకదుర్గమ్మ మహాలక్ష్మీ అవతారంలో దర్శ నమిస్తారు. ఈ తల్లికి ఆకుపచ్చ వర్ణం వస్త్రాలతో అలంకరించి దద్దోజనం, చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి.
లక్ష్మీ కవచం నిత్య పారాయణ చేసేవారి గృహం సంపదల కు శాశ్వత నివాసం. శుక్రవార నియమం పాటించి ఐశ్వర్య లక్ష్మి ని కొలచినవారికి కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి. నవరాత్రులలో శ్రీమహాలక్ష్మిగా మనలను అనుగ్రహంచే తల్లి ఆశీస్సులు కోరు తూ ఈ శ్లోకం నిరంతర మననం చేసుకుందాం.

భృగువారే శతం ధీమాన్‌ పఠేత్‌ వత్సరమాత్రకం|
అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలే||

Advertisement

తాజా వార్తలు

Advertisement