Wednesday, February 21, 2024

Peddapalli: ఆలోచించి ఓటెయ్యండి.. అభివృద్ధికి పట్టం కట్టండి.. ఎమ్మెల్యే దాసరి

కాల్వశ్రీరాంపూర్‌, నవంబర్‌ 22 (ప్రభన్యూస్‌): పోరాడి సాధించుకున్న తెలంగాణ దశాబ్ధ కాలంలోనే సీఎం కేసీఆర్‌ పాలనలో ప్రతి పల్లె అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ప్రతిపక్షాల మాయమాటలు నమ్మి మోసపోతే.. మరోసారి గోస పడక తప్పదని పెద్దపల్లి ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ అసెంబ్లి అభ్యర్థి దాసరి మనోహర్‌ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని జాఫర్‌ఖాన్‌పేట, కాల్వశ్రీరాంపూర్‌, పెద్దరాతుపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే దాసరి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ… దేశంలో, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసి చూపించారన్నారు.

మూడోసారి కూడా రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 5లక్షల బీమా ఆసరా పెన్షన్‌, రైతుబంధు, ఆరోగ్యశ్రీ పెంపుతో పాటు రేషన్‌ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రజలకు మోసగించే ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలు నమ్మి మోసపోతే గోసపడతామన్నారు. నవంబర్‌ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేసి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కాగా, గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే దాసరికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికి ఆత్మీయంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్‌ యాదవ్‌, జూకంటి శిరీష, జెడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌లు గజవెల్లి పురుషోత్తం, చదువు రామచంద్రారెడ్డి, ఎంపీటీసీలు పుల్లూరి రమ రాజమల్లు, మాదాసి సువర్ణ చందు, ఆయా గ్రామాల సర్పంచులు దొమ్మటి శ్రీనివాస్‌, ఆడెపు శ్రీదేవి రాజు, బీఆర్‌ఎస్‌ నాయకులు నిదానపురం దేవయ్య, కర్ణాకర్‌ రావు, సాగర్‌, జిన్న రామచంద్రారెడ్డి, కొట్టే రవి, నూనేటి కుమార్‌, దర్ముల రవి, శ్రీనివాస్‌లతోపాటు బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement