Saturday, March 2, 2024

Peddapalli: ప్రతిపక్షాలకు మూడోసారీ భంగపాటే… ఎమ్మెల్యే దాసరి

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు మూడోసారీ భంగపాటేనని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ ఓదెల మండలం గూడెం గ్రామంలో గడపగడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. అనంతరం మాట్లాడుతూ… అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రజలు మరోసారి నమ్మి ఓట్లు వేస్తారన్నారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని, పెద్దపల్లిలో సైతం గులాబీ జెండా ఎగురుతుందన్నారు. వారంటీ లేని పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చినా, 60 గ్యారంటీలు ఇచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు.

సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని, ప్రపంచంలో ఎక్కడా కూడా కేసీఆర్ అందిస్తున్న పథకాలు లేవన్నారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, కేసీఆర్ కిట్టు, జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ అంటివి ఒక్కటి కూడా కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేవన్నారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ప్రజలు అండగా నిలవాలని అభ్యర్థించారు.

ఇంటింటా ప్రచారంలో ఎమ్మెల్యే వెంట ఓదెల జడ్పీటీసీ గంట రాములు, మండల పార్టీ అధ్యక్షులు మార్కెట్ వైస్ ఛైర్మెన్ ఐరెడ్డి వెంకట్ రెడ్డి, ఛైర్మెన్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు ఆళ్ల రాజిరెడ్డి, ఆకుల మహేందర్, మండల యూత్ అధ్యక్షులు మ్యాడగొని శ్రీకాంత్, గట్టు మహేష్, రెడ్డి శ్రీనివాస్, దాసరి రాజన్న, సర్పంచ్ గోవిందుల ఎల్లస్వామి, ఉప సర్పంచ్ బోనగిరి రాజయ్య, మాజీ సర్పంచ్ చంద్ర మొగిలి, గ్రామ శాఖ అధ్యక్షులు ఉప్పుల శ్రీనివాస్, రైతు సమితి గ్రామ కో ఆర్డినేటర్ రేగుల సంపత్, యూత్ అధ్యక్షులు నాగముని, కర్ర రాజు, తిప్పారపు రాజేందర్, సుదర్శన్, మహేష్, రఘుపతి, ప్రవీణ్, సదయ్య, రవీందర్, సతీష్, సాయి, నవీన్, సంతోష్, రమేష్, రమణ, సాగర్, రమేష్, మండల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, భారత రాష్ట్ర సమితి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement