Thursday, April 25, 2024

రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది.. మంత్రి కొప్పుల

ధర్మారం : రైతు బాగుంటేనే రాజ్యం కూడా బాగుంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. ఈరోజు ధర్మారం మండల కేంద్రంలో రూ.3.10 కోట్ల నిధులతో చేపట్టిన సెంట్రల్‌ లైటింగ్‌, సైడ్‌ డ్రెయిన్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. అనంతరం ధర్మారం మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… తెరాస ప్రభుత్వం అన్నదాత ప్రభుత్వమని, రైతు బాగుండాలని భావించిన సీఎం కేసీఆర్‌ రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌తో అన్నదాతను ఆదుకుంటున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. అలాగే తెలంగాణలోని గ్రామాలన్నీ అభివృద్ధి విషయంలో ఆదర్శంగా నిలిచేలా ప్రగతి సాధిస్తున్నాయన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా గ్రామాలను అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ బలరాంరెడ్డి, జడ్పీటీసీ పూసుకురు పద్మజ, పాక్స్‌ చైర్మైన్‌ ముత్యాల బలరాంరెడ్డి, మార్కెట్‌ కమిటీ- జిల్లా మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌ రెడ్డి, ఎంపీడీఓ జయశీల, తహశీల్దార్‌ వెంకటలక్ష్మి, తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement