Thursday, April 25, 2024

గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు… పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి

ప్రాణాంతకమైన గంజాయిని విక్రయించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి హెచ్చరించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పాన్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ… పాన్ షాపుల్లో గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించామన్నారు. ఇకపై తరచూ తనిఖీలు నిర్వహిస్తామని, నిషేధిత ఉత్పత్తుల అమ్మకాలు చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి వాడకం వల్ల యువత బంగారు భవిష్యత్తు బుగ్గిపాలవుతుందన్నారు. ప్రజలు ఎవరైనా గంజాయి విక్రయించినా, రవాణా చేసినా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. తనిఖీల్లో పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ రాజేష్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement