Friday, May 17, 2024

సామాజిక సేవలో ముందుంటాం..

పెద్దపల్లిరూరల్‌: సామాజిక సేవలో తాము ముందుంటామని దాసరి యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం వినోద్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన కుమారుడు అల్లం వినయ్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని స్ఫూర్తి మానసిక వికలాంగుల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి మానసిక వికలాంగులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వికలాంగులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువసేన ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రానున్న రోజుల్లో సేవలను మరింత విస్తృతపరిచి నిరుపేదలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement