Tuesday, May 21, 2024

యూత్‌ కాంగ్రెస్‌ నాయకుల అరెస్ట్

ముత్తారం: టిఆర్‌ఎస్‌ పార్టీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ ఇచ్చిన పిలుపుమేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న ముత్తారం మండల యూత్‌ కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ముత్తారం ఎస్‌ఐ నర్సింహరావు సిబ్బందితో కలిసి యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు బియ్యని శివకుమార్‌, ఉపాధ్యక్షులు గాదం శ్రీనివాస్‌, సర్పంచ్‌ తూటి రజిత రఫీ, యూత్‌ కాంగ్రెస్‌ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కోల విజయ్‌, ఉపాధ్యక్షులు అనుము లక్ష్మణ్‌, యూత్‌ సభ్యులు కేక్కర్ల మహేష్‌ గౌడ్‌, బియ్యని రాజబాబు, బియ్యని రాజేందర్‌, గుడి రాములు, కాంగ్రెస్‌ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు బాలసాని మొగిళి, సినియర్‌ నాయకులు బక్కతట్ల కుమార్‌, వెల్మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, అల్గం సంపత్‌లను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement