Sunday, October 6, 2024

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ : కరీంనగర్ సీపీ సుబ్బారాయుడు

నకిలీ విత్తనాలు విక్రయించి రైతులను మోసగిస్తే పీడీ యాక్ట్ పెడతామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు హెచ్చరించారు. సోమవారం మానకొండూరులోని సీడ్స్ కంపెనీలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విత్తనాల నిల్వలు, ప్యాకింగ్ లో నిబంధనల ప్రకారం ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే అంశంతో పాటు రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీ అంజని కుమార్ ల ఆదేశాల మేరకు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాల విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించినా, సరఫరా చేసిన పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. సీపీ వెంట టాస్క్ ఫోర్స్, సివిల్ పోలీసులతోపాటు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement