Friday, May 17, 2024

అసలైన మహిళా బంధువు కేసీఆర్ : ఎమ్మెల్యే దాస‌రి

దేశంలోనే అసలైన మహిళా బంధువు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మూడురోజుల మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టి థాంక్యూ కేసీఆర్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్రంలో మహిళాభివృద్ధికి ముఖ్యమంత్రి పెద్దపీట వేశారని, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 10 లక్షల కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహాలకు లక్ష నూట పదహారు రూపాయలు అందించారన్నారు. కేసీఆర్ కిట్ల పథకం ద్వారా 11 లక్షల మందికి లబ్ధి చేకూరిందన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మన్ డాక్టర్ దాసరి మమత ప్రశాంత్ రెడ్డి, మహిళా కౌన్సిలర్లు, మహిళా సపాయి కార్మికులు, తెరాస మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement