Monday, February 26, 2024

ఉమ్మడి కరీంనగర్ లో 10 వేలకు పైనే దరఖాస్తులు.. అర్ధరాత్రి వరకు కొనసాగనున్న ప్రక్రియ

మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల స్వీకరణకు శుక్రవారాం చివరి రోజు కావడంతో వ్యాపారులు బారులు తీరారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని 290 మద్యం దుకాణాలకు దరఖాస్తులు 10 వేలు దటనున్నాయి. దరఖాస్తుల స్వీకరణ రాత్రి 12 గంటలవరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

స్వీకరణ సమయం వరకు లైన్ లో ఉన్నవారికి టోకెన్లు జారీ చేసి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రభుత్వానికి దరఖాస్తుల ద్వారా 200 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరనుంది. ఇప్పటి వరకు అత్యధికంగా కరీంనగర్ సమీపంలోని చింతకుంట దుకాణం కు 97, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట దుకాణం కు77 దరఖాస్తులు అందయు.

Advertisement

తాజా వార్తలు

Advertisement