Wednesday, February 28, 2024

అదుపుత‌ప్పిన కారు.. త‌ప్పిన పెను ప్రమాదం

మాన‌కొండూర్ : మానకొండూర్ మండలం చెంజర్ల వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అయితే పక్కనే ఉన్న వ్యవసాయ బావి ఉండ‌డంతో తృటిలో పెను తప్పిన ప్రమాదం త‌ప్పింద‌ని కుటుంబీకులు ఊపిరిపీల్చుకున్నారు. ఈఘ‌ట‌న‌లో కారులోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్లలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న ధరావత్ కిషన్ త‌న కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగ్రామమైన నర్సంపేట జిల్లా ఖానాపూర్ మండలం ధర్మారావు పేట బాలు తండా గ్రామంలో దేవుడిని చేసుకునేందుకు వెళ్లారు. శుక్రవారం ఉదయం 3 గంటలకు తిరిగి వస్తుండగా మండలంలోని చెంజర్ల వద్దకు రాగానే రోడ్డు పక్కకి కారు దూసుకెళ్లింది. ప‌క్కనే వ్యవసాయ బావి ఉంది.. కొద్దిపాటి క్ష‌ణాల్లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో భార్య ప్రవళిక, కుమారులు సౌరీ, రిత్విక్ ల‌కు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చౌరీ అనే బాలుడు పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించినట్టు సీఐ కృష్ణారెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement