Wednesday, December 11, 2024

క్రీడలతో మానసికొల్లాసం.. ఎమ్మెల్యే దాసరి

క్రీడా పోటీలతో మానసికోలాసం పెంపుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలో అనుదీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి-శ్రీనివాస్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, మండల పార్టీ అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్, ఛైర్మెన్ లు దాసరి చంద్రారెడ్డి, మాదిరెడ్డి నరసింహా రెడ్డి, యూత్ మండలాధ్యక్షుడు కొయ్యడ విక్రం, సర్పంచ్ ఆడెపు వెంకటేష్, ఎంపీటీసీ శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షడు కొమురయ్య, తాడిశెట్టి శ్రీకాంత్, గాండ్ల సతీష్, సదయ్య, రమేష్, మల్లయ్య, శ్రీనివాస్, కుంట మల్లమ్మ, బీ ఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement