Thursday, February 29, 2024

కులాంతర వివాహం.. అబ్బాయి ఇంటికి నిప్పు..

కులాంత‌ర వివాహం చేసుకున్నార‌ని.. అమ్మాయి బంధువులు అబ్బాయి ఇంటికి నిప్పంటించిన ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. హుజురాబాద్‌కు చెందిన రాజశేఖర్, సంజన కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. సోమవారం వేములవాడలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జంట పోలీసులను ఆశ్రయించింది. కులాంతర వివాహం చేసుకోవడం అమ్మాయి కుటుంబీకులకు ఇష్టంలేదు. దీంతో వ్యవసాయ మార్కెట్ వద్ద ఉన్న రాజశేఖర్ ఇంటికి ఆమె బంధువులు నిప్పుపెట్టారు. ఇల్లు పూర్తిగా కాలిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement