Friday, March 29, 2024

అందుకే అడల్ట్ చిత్రంలో న‌టించా.. బండ్ల గ‌ణేశ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో అడ‌ల్ట్ చిత్రాల్లో కూడా న‌టించారు నిర్మాత‌..న‌టుడు బండ్ల గ‌ణేష్..ఈ విషయంపై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.నిజానికి అలాంటి సినిమాల్లో తాను నటించాలని అనుకోలేదు అని.. నిర్మాత నట్టి కుమార్ ఒక సినిమాలో హీరో పాత్ర అని చెప్పగానే చేయడానికి ఒప్పుకున్నట్లుగా తెలియజేశాడు.అయితే ఆ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత కానీ అసలు విషయం అర్థం కాలేదు అని ఏదో నార్మల్ సినిమా అనుకుంటే ఆ తర్వాత ఊహించిన విధంగా అలాంటి సన్నివేశాలు నటించాల్సి వచ్చింది అని చెప్పాడు.

నిర్మాత ఏదో పైకి కిందకి అంటే సరిపోతుంది అని ఏదో మాట్లాడి ఆ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయించాడు అని ముందే తెలిసి ఉంటే అలాంటి సినిమా చేయకపోయేవాడిని అని బండ్ల గణేష్ తెలిపాడు. అంతే కాకుండా అప్పట్లో హీరో అంటే ముందుగా పెద్దగా కథలు ఎవరు చెప్పేవారు కాదు. నాలాంటి చిన్న స్థాయి నటుడికి ఒక ఆఫర్ ఇస్తే సైలెంట్ గా వెళ్లి షూటింగ్ లో పాల్గొనే రోజులు అవి. ఆ విధంగా నాకు తెలియకుండానే అలా జరిగిపోయింది. మళ్ళీ ఆ విధంగా రిపీట్ కాకుండా చూసుకున్నట్లుగా.. గణేష్ తెలియజేశాడు. ఇక బండ్ల గణేష్ నిర్మాతగా రాబోయే రోజుల్లో మళ్ళీ బిజీ అవుతానని చెబుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement