Tuesday, October 8, 2024

వైభవంగా బొడ్రాయి విగ్ర‌హ‌ ప్రతిష్ఠాపన

కరీంనగర్ రూరల్ మండలంలోని గోపాల్ పూర్ గ్రామంలో శ్రీ లక్ష్మి, మహాలక్ష్మి బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభ‌వంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజర‌య్యారు. మంత్రి వెంట మనకొండుర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, మండల పార్టీ అధ్యక్షుడు, పాక్స్ చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి, దూర్షెడ్ పాక్స్ చైర్మన్ గోనె నర్సయ్య, గ్రామ సర్పంచ్ ఉరడి మంజుల – మల్లారెడ్డి, ఉప సర్పంచ్ లు శ్రీకాంత్, సుంకిషాల సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement