Saturday, March 2, 2024

KNR: మెగా రక్తదాన శిబిరానికి విస్తృత ఏర్పాట్లు… ఏసీపీ మహేష్

ఆపదలో ఉన్నవారికి ప్రాణదానం చేసేందుకు పెద్దపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఏసీపీ ఎడ్ల మహేష్ తెలియజేశారు. బుధవారం ఐటిఐ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ… మహాత్ముడి జయంతి అయిన అక్టోబర్ రెండవ తేదీన రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి ఆదేశాల మేరకు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామన్నారు.

21 జిల్లాల రెడ్ క్రాస్ సొసైటీల సహకారంతో ప్రధాన శిబిరం నిర్వహిస్తున్నామని, రక్తదానం చేసేందుకు ఇప్పటికే సబ్ డివిజన్ పరిధిలోని యువతీ యువకులు 7వేల మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. 6006 యూనిట్ల రక్తదానం ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు అనిల్, జగదీష్, ఎస్ఐలు మహేందర్, మల్లేష్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement