Saturday, April 27, 2024

ఓదెల పిహెచ్‌సి వైద్యురాలిగా లావణ్య..

ఓదెల: మండల కేంద్రమైన ఓదెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలిగా డాక్టర్‌ లావణ్య బాధ్యతలు స్వీకరించారు. జగిత్యాల జిల్లా మల్యాల పిహెచ్‌సీలో పని చేస్తున్న లావణ్యను ఓదెల వైద్యురాలిగా బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓదెల పరిధిలోని అందరి సహాయ సహకారాలతో వైద్య సేవలందిస్తామని, ఆరోగ్య సమస్యలు ఉన్న ఎవరైనా ఆసుపత్రికి రావాలని కోరారు. అలాగే హాస్పటల్ ఆరోగ్య బృందం లావణ్య పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని, కరోనా వ్యాక్సిన్‌ 45 ఏళ్ల వయసు నిండిన వారంతా తీసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement